ఇన్స్టాగ్రామ్ ద్వారా సమంత నెలకు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారా..?

ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో దూసుకుపోయారు.అయితే సమంత కెరియర్లో కూడా కొన్ని ఫ్లాప్ సినిమాలు ఎదురైనప్పటికీ ఈమె వెంటనే అలర్ట్ అయ్యి సినిమా ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా గడుపుతున్నారు.

ఇక విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాల విషయంలో తన దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా భారీగా రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే సమంత ఎన్నో రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ పోస్టులు సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

ఇలా సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా చేసే పోస్టులు క్షణాలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే పలు. బ్రాండ్లకు సంబంధించిన ఫోటోలను ఈమె షేర్ చేయడం వల్ల ఈమె నెలకు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఈమె ఒకవైపు సోషల్ మీడియా మరో వైపు సినిమాలు, మరో వైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగానే డబ్బులు సంపాదిస్తున్నారు.