Ntr: సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. నందమూరి వారసులుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో చాలామందికి ఎంతో సన్నిహితంగా ఉంటారు.
ఇక ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ సరదా వాతావరణం నెలకొంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇలా అందరి హీరోలో ఎన్టీఆర్ తో చాలా చనువుగా ఉండటమే కాకుండా ఆయన అంటే కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అందరూ ఎన్టీఆర్ ను తారక్ అని పిలుస్తూ ఉంటారు. మరికొందరు తారక్ అన్నా అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఒక హీరో మాత్రం ఎన్టీఆర్ ను ఏరా అంటూ పిలుస్తారని తెలుస్తుంది.
ఇలా ఎన్టీఆర్ ను ఏరా అంటూ పిలిచేది ఎవరు ఆయన ప్రేమతో అలా పిలుస్తున్నారా లేకపోతే పొగరుతో అలా పిలుస్తున్నారా అని చాలామంది అభిమానులు ఫైర్ అవుతున్నారు కానీ ఎన్టీఆర్ ను ఆ విధంగా పిలిచే వ్యక్తి ఎవరో తెలిస్తే ఆయన ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారో కూడా స్పష్టమవుతుంది. ఎన్టీఆర్ ను ఏరా అంటూ పిలిచే ఏకైక వ్యక్తి మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అని తెలుస్తుంది.
ఎన్టీఆర్ ను చిరంజీవి చాలా పర్సనల్ గా ట్రీట్ చేస్తారట. ఆయనని కూడా తన సొంత కుటుంబ సభ్యుడిగా భావించటం వల్లే ఎన్టీఆర్ ను ఏరా అంటూ పిలుస్తారని తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ అంటే చిరంజీవికి అమితమైన ప్రేమ అని చరణ్ తో సమానంగానే తనని కూడా భావించటం వల్లే అలా పిలుస్తారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ పనులతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు.