Sobhita: సినీనటి శోభిత ఇటీవల అక్కినేని నాగచైతన్యను రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నాగచైతన్య శోభితల వివాహం జరిగిన తర్వాత నాగచైతన్య నటించిన తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్య తన వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టిన సంగతి తెలిసిందే.
నటి సమంతతో విడాకులు శోభితతో పెళ్లి గురించి కూడా ఈయన స్పందించారు. ఇక శోభిత గురించి మాట్లాడుతూ తాను ఏ విషయం అయినా చాలా స్పష్టతతో ఉంటుందని తాను ఏదైనా ఒక పని చేయాలి అంటే తప్పనిసరిగా శోభిత నిర్ణయం తీసుకుంటానని నాగచైతన్య వెల్లడించారు. ఇక ఇద్దరికీ సినిమాలంటే ఫ్యాషన్ అని తెలిపారు. ఇకపోతే నాగచైతన్య నటించిన సినిమాలలో శోభిత ఫేవరెట్ సినిమా అలాగే నచ్చని సినిమా గురించి కూడా బయటపెట్టారు.
శోభితకు నేను నటించిన బెజవాడ సినిమా చూస్తే అసలు నచ్చదని తెలిపారు. ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎప్పుడైనా చూసింది అంటే కచ్చితంగా నన్ను తిడుతూనే ఉంటుందని నాగచైతన్య తెలిపారు. అలాగే తాను నటించిన ఏ మాయ చేసావే సినిమా అంటే శోభితకు చాలా ఇష్టమని స్వయంగా నాగచైతన్య ఈ విషయాలను బయటపెట్టారు. ఆ సినిమా తనకు నచ్చి ఎన్నోసార్లు చూసిందని తెలిపారు.
ఇకపోతే ఏం మాయ చేసావే సినిమా ద్వారా నాగచైతన్యకు జోడిగా సమంత నటించిన ఈ సినిమాకి ఎంతో మంచి సక్సెస్ అయింది ఈ సినిమా ద్వారా వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే సమంత నాగచైతన్య నటించిన ఏం మాయ చేసావే సినిమా శోభితకు చాలా ఇష్టం అంటూ తెలియటంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.