అభిమాని కోసం రష్మిక చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏం చేశారంటే?

ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అందాల నటి రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం సినిమా ద్వారా బాగా పాపులర్ అయిన రష్మిక అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తెలుగు తమిళ్ హిందీ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన రష్మిక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. రష్మిక తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవల రష్మిక పుష్ప సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ద్వార రష్మిక క్రేజ్ మరింత రెట్టింపు అయ్యింది.

పుష్ప సినిమా ద్వార పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తోంది. ఎప్పుడూ సినిమాలతో బిజిగా రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో ఆక్టివ్ గా ఉంటుంది. రష్మిక సోషల్ మీడియాలో ద్వారా సినిమా విషయాలను మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే రష్మిక తాజగా చాలా సీరియస్ అయ్యింది. అందుకు కారణం ఆమె అభిమాని. అవునండీ.. తన అభిమని కోసం రష్మిక చేసిన పని తెలిస్తే మీరూ కూడ ఆశ్చర్యపోతారు.

అసలు విషయానికి వస్తే తాజాగా రష్మికకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక తెల్లరంగు దుస్తులలో ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఈ క్రమంలో ఒక అభిమాని రష్మికతో ఫోటో దిగటానికి ప్రయత్నిస్తుండగా ఆమె బాడీగార్డ్స్ అతనిని అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారు. దీంతో రష్మిక తన బాడీగార్డ్స్ మీద సీరియస్ అవుతు అభిమానిని దగ్గరకు పిలిచి మరీ ఫోటో దిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రష్మిక మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ స్టార్స్ ఎప్పుడు డౌన్ టు ఎర్త్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.