జబర్దస్త్ చూసి హీరో వెంకటేష్ ఏమన్నారో తెలుసా.. ఆసక్తి విషయాలు చెప్పిన అభి..!

ఎన్నో టీవీ షో లు బుల్లితెర మీద సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అటువంటి వాటిలో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అటువంటి వారిలో కొంతమంది బాగా పాపులర్ అయ్యారు. ఇలా పాపులర్ అయిన వారిలో అదిరే అభి కూడ ఒకరు. అభి జబర్థస్త్ లో టీమ్ లీడర్ గా స్కిట్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ ఇటీవల కొన్ని కారణాల వల్ల అభి జబర్దస్త్ విడిచి మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో కి వెళ్ళాడు.

అగ్ని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి దగ్గర పనిచేసిన సమయంలో రాజమౌళి తనని బాగా ఎంకరేజ్ చేశారు అని చెప్పుకొచ్చాడు. అలాగే ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. ఇండస్ట్రీలో ఉన్న ఒక దర్శకుడు దగ్గరికి అవకాశం కోసం వెళ్తే నేనెవరో తెలియదు అన్నట్టు మాట్లాడారు. అసలు తను టీవి చూడనని చెప్పి రోజా, నాగబాబు నిజంగా నవ్వుతారా అని అడిగాడు. ఆసలు టీవి చూడనివాడు రోజా, నాగబాబు నవ్వటం ఎలా తెలుసో.. అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక వెంకటేష్ గారిని 3,4 సందర్భాలలో కలిసినప్పుడు ఆయన నీ కామెడీ బాగుంటుందని మెచ్చుకున్నాడు. నాకు డబ్బులు సంపాదించడం కన్న మంచి పేరు తెచ్చుకోవటం ముఖ్యం. నేనూ ఎప్పుడూ ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశ పడలేదు. అలా సంపాదించాలనుకుంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో నాకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. తనకి కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఆసక్తి ఉందని అందువల్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేర్చుకున్నాను అంటూ అభి ఈ సందర్భంగా తెలియజేశారు.