బాబోయ్ సుధీర్ ని అభి అంత మాట అనేశాడేంటి.. దారుణంగా సుధీర్ పరువు తీసాడు

బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో జబర్దస్త్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఫేమస్ అయ్యి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్లలో అదిరే అభి కూడా ఒకరు. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నా అవి నటన మీద ఉన్న ఆసక్తి వల్ల ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట సినిమాలలో నటించిన అభి, జబర్దస్త్ లో అవకాశం రావడంతో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు. అయితే అభి ప్రస్తుతం జబర్ధస్త్ కి దూరంగా ఉంటున్నాడు.

ప్రస్తుతం అభి మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే షోలో సందడి చేస్తున్నాడు. అయితే ఇటీవల జబర్ధస్త్ నుండి ఆది, సుధీర్, శ్రీను వంటి వారు బయటికి వచ్చారు. సుధీర్ కూడా ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్, కామెడీ స్టార్స్ షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోని ‘మా సూపర్ సండేస్’ పేరుతో ప్రసారం చేస్తున్నారు. ఈ షో లో సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే పార్టీ లేదా పుష్ప ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ఎపిసోడ్ లో అభి స్కిట్ చేస్తూ సుధీర్ మీద సెటైర్లు వేసాడు. ఈ స్కిట్ లో రాజు పాత్రలో నటిస్తున్న అభి ని ఒక యువతి వచ్చి రాజుగారు ఓడలు బళ్ళు అవటం, బళ్ళు ఓడలు అవటం అంటే ఏమిటి? అని అడుగుతుంది. అందుకు సమధానం అభి..ఒకప్పుడు యాంకర్ గా చేసిన నేను ఇప్పుడు కామెడీ చేస్తూ బతుకుతున్నా..ఒకప్పుడు కామెడీ చేసిన ఆయన ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నాడు అంటూ సుధీర్ వైపు చూపిస్తాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగ నవ్వుతారు. నిజానికి హైపర్ ఆది కి తన స్కిట్ లో అభి అవకాశం ఇచ్చాడు. కానీ ఇప్పుడు అభి కన్నా ఆది బాగా పాపులర్ అయ్యాడు.