Nagabaabu: మెగావారింట గత యేడాది నాగబాబు కూతురు నిహారిక పెళ్లితో సందడి వాతావరణం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన నిహారిక – చైతన్యల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఎంతో ప్రముఖులు కూడా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇకపోతే నిహారిక-చైతన్యల వివాహం గతేడాది డిసెంబర్ 9వ తేదీన రాత్రి 7గంటల 10 నిమిషాలకు ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో ఎంతో ఆడంబరంగా జరిగింది. ఇదిలా ఉండగా నాగబాబు తన అల్లుడు చైతన్యకు ముట్టజెప్పుతున్న లాంఛనాలపై అప్పట్లోనే చర్చనీయాంశమైన విషయంగా మారింది. ఎందుకంటే అది మెగా ఫ్యామిలీలో జరిగిన పెళ్లి కదా. భారీగానే ఖర్చు చేస్తారన్న విషయం తెలిసిందే. కానీ కట్నకానుకల విషయంపై అప్పట్లో చాలా వార్తలు కూడా వచ్చాయి. ఇక ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికొస్తే వీళ్లది మెగా ఫ్యామిలీ. ఆస్తులు, అంతస్తుల గురించి చెప్పనక్కర్లేదు. అటుపోతే చైతన్య ఫ్యామిలీ కూడా బాగా రిచ్ పార్టీనే. కాబట్టి నాగబాబు ఆ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా తన ముద్దుల కూతురి పెళ్లికి బాగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
అయితే నాగబాబు తన అల్లుడు చైతన్యకు కట్నంగా దాదాపు 10 కోట్ల రూపాయల వరకు లాంఛనంగా ఇచ్చినట్టు సమాచారం. ఇక నిహారిక నగల కోసం మరో 2 కోట్లు వెచ్చించినట్టు ప్రచారం. దీంతో పాటు నిహారిక పేరు మీదున్న బంగ్లాను కూడా అల్లుడికే ఇచ్చినట్టు సమాచారం. సెలబ్రిటీల ఇళ్లలో పెళ్లి అంటే డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటారు. పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖుల వివాహం అంటే వారి రేంజ్‌కి సరిపోయే రీతిలో వైభవంగా జరిపించడం చూస్తూనే ఉంటాం. వారిలో దాదాపు 700నుంచి 800 కోట్ల వరకు ఖర్చు చేసిన వారు కూడా లేకపోలేదు.