ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ నైనిక గురించి ఈ విషయాలు తెలుసా?

సాధారణంగా బుల్లితెర మీద, వెండి తెర మీద హీరో హీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. హీరో హీరోయిన్ల చిన్ననాటి పాత్రలో మాత్రమే కాకుండా ఇతర పాత్రల్లో కూడా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు నటిస్తున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించిన ఎంతోమంది ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక బుల్లితెరలో ప్రసారమవుతున్న సీరియల్స్లో చైల్డ్ ఆర్టిస్టులకు కొదవలేదు. కొన్ని సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలో నటిస్తూ.. సీరియల్ కి మంచి గుర్తింపు తెస్తున్నారు. ఇలా అతిచిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన ఖుషి అలియాస్ నైనిక కూడా బాగా పాపులర్ అయ్యింది.

మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో ఖుషి పాత్రలో నటించిన నైనిక ఆ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటిసారిగా నైనిక ఈ సీరియల్ లో నటిస్తున్నప్పటికీ తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో నైనిక తన ముద్దు ముద్దు మాటలతో పాటు క్యూట్ రియాక్షన్స్ తో ప్రేక్షకుల హృదయాలలో ముద్ర వేసుకుంది. ఇలా ఈ సీరియల్ ద్వారా పాపులర్ అయిన నైనిక గురించి తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో తన ముద్దుముద్దు మాటలతో ఆకట్టుకుంటున్న చిన్నారి ఖుషి అసలు పేరు నైనిక. ఈమె ముద్దు పేరు మిన్ను. సంగారెడ్డికి ప్రాంతానికి చెందిన నైనిక ఊహ తెలిసినప్పటి నుంచీ నటనపై చాలా ఆసక్తి చూపేదని ఆమె తల్లదండ్రుల చెప్పుకొచ్చారు. చిన్న వయసులోనే టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన నైనిక తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వడం వల్ల ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇలా బుల్లితెరపై తను నటించిన మొదటి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ప్రస్తుతం నైనికకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.