వెండితెర జేజమ్మగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సినిమాల గురించి ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా ఎన్నో విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రయోగాత్మక సినిమాల ద్వారా అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే ఈమె సైజ్ జీరో సినిమా కోసం భారీ బరువు పెరిగారు. అయితే ఈమె తిరిగి తన సాధారణ స్థితికి చేరుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. అనుష్క ఇలా అమాంతం బరువు తగ్గడానికి ఏ విధమైనటువంటి ఫుడ్ డైట్ ఫాలో అయ్యారు, తను ఏ విధమైనటువంటి ఆహారపదార్థాలను తీసుకుంది అనే విషయానికి వస్తే.. అనుష్క ఎక్కువగా నీటిని తాగడానికి ఇష్టపడతారట. ఎంత ఎక్కువ నీరు తాగితే మన శరీరం అంత హైడ్రేట్ గా ఉంటుందని నమ్ముతారట.
ముఖ్యంగా ఈమె తీసుకునే ఆహార పదార్థాలలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే కూరగాయలు అధికంగా తీసుకుంటారు.ఈమె ఒకేసారి ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోకుండా మూడు పూటలా తీసుకునే ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలా చేయటం వల్ల తరచు ఆహారంపై దృష్టి ఉండకుండా ఆకలి కలగదని భావిస్తారు. ఇకపోతే అనుష్క ఎక్కువ ఆయిల్ లేకుండా ఇంటిలో తయారు చేసిన భోజనం తీసుకుంటారట. ఇక రాత్రి 8 గంటలలోపే భోజనం చేయడమే ఈమెకు అలవాటు. వీటితో పాటు ప్రతి రోజు తప్పకుండా వ్యాయామాలు చేస్తూ యోగా చేస్తూ తన బరువును అదుపులో ఉంచుకున్నారు.