Sudigaali sudheer: సుడిగాలి సుధీర్ ఒక్కో షోకి తీసుకునే రెమ్యూనరేషన్ ఏంతో తెలుసా..?

Sudigaali sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద సుధీర్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. మొదట జబర్థస్త్ లో కమెడియన్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన సుడిగాలి సుధీర్ తన ప్రతిభతో అతి అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ అయ్యాడు. తర్వత గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ తో కలిసి స్కిట్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఇక జబర్దస్త్ యాంకర్ రష్మీ తో కలిసి పలు టీవీ షోలు చేయటం వల్ల వారిద్దరి మధ్య ప్రేమాయణం నడపటం వల్ల మరింత పాపులర్ అయ్యాడు.

ఒకవైపు బుల్లితెర మీద మరొకవైపు వెండితెర మీద తన సత్తా చాటుతున్న సుధీర్ గురించి కొన్ని పర్సనల్ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుధీర్ కమెడియన్ గా, యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలు రావడంతో సినిమాలలో కూడా నటిస్తూ .. హీరోగా కూడా నటించాడు. ఇక సుడిగాలి సుదీర్ ఆదాయం విషయానికి వస్తే..జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ ఒక స్కిట్ కి దాదాపు ఐదు నుండి ఆరు లక్షల రూపాయల వరకు తీసుకుంటాడు.

ప్రస్తుతం సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కి 80 వేల నుండి లక్ష దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇక ఢీ షో లో మెంటర్ గా చేసినందుకు ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు ఒకటిన్నర లక్ష రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. ఈ క్రమంలోనే టీవీ షోల ద్వారా సుధీర్ దాదాపు నెలకు 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే .. చిన్న చిన్న పాత్రలకు మూడు నుండి నాలుగు లక్షల వరకు తీసుకొని సుధీర్ హీరోగా సినిమా చేయడానికి 30 నుండి 40 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు సుధీర్ సినిమాల నుండి , టీవీ షో లో నుండి దాదాపు సంవత్సరానికి రెండు నుండి మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.