Puspha Movie:సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆ సినిమాలో కొన్ని డిలీట్ చేసిన సన్నివేశాలను తిరిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అభిమానులు మరొక సారి ఆ సినిమాను గుర్తు చేసుకుంటారని చిత్ర బృందం ఈ విధంగా ఆ సినిమా నుంచి తొలగించిన సన్నివేశాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 17వ తేదీ విడుదలైన పుష్ప సినిమా నుంచి కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు చిత్రబృందం తర్వాత సోషల్ మీడియా వేదికగా సన్నివేశాలను విడుదల చేశారు.
ఈ సన్నివేశాలను చూసిన ఎంతో మంది అభిమానులు ఈ సన్నివేశం ఎంతో అద్భుతంగా ఉంది ఇదే కనుక సినిమాలో ఉంటే సినిమా మరింత అద్భుతమైన విషయాన్ని అందుకునేది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇలా ఈ సినిమాలో డిలీట్ చేసిన ఈ సన్నివేశాన్ని ఎందుకు తొలగించారు చాలా అద్భుతంగా ఉంది కదా అంటూ పలువురు నెటిజన్లు వారి సందేహాలను వ్యక్తపరిచారు. అయితే ఈ సన్నివేశాలను ఎందుకు తొలగించారు అనే విషయానికి వస్తే…
సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అల్లుఅర్జున్ తల్లి చేసిన అప్పును తిరిగి చెల్లించాలని నలుగురిలో అవమాన పరిచారు. దీంతో పుష్ప తన బర్రెలను అమ్మి తన అప్పు తీరుస్తాడు.నువ్వు అప్పు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే మరి మేము తిరిగి ఇచ్చామన్న సంగతి కూడా అందరికీ తెలియాలి కదా అంటూ తనని ఊరంతా తిప్పి కొడతాడు. అయితే ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ తన మాస్ లుక్ లో పళ్ళు తోముకుంటే కాలకృత్యాల కోసం వెళ్తారు.ఈ సన్నివేశం తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కానీ మన తెలుగు వాళ్ళకి నచ్చదనే సందేహాన్ని అల్లు అర్జున్ వ్యక్తపరచడం తో ఈ సన్నివేశాన్ని తొలగించినట్లు సమాచారం. అందుకే ఈ సన్నివేశాన్ని పుష్ప సినిమా నుంచి తొలగించారని తెలుస్తోంది.