దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆగ్ర తారగ పేరు సంపాదించుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈమె వరస తెలుగు తమిళ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు ఎంతో ఖరీదైన వస్తువులను మంచి బ్రాండ్ కు సంబంధించిన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు ఏ రేంజ్ లో డబ్బు సంపాదిస్తారో అదే రేంజ్ కు అనుగుణంగా ఖర్చుచేసి వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఖరీదైన డ్రస్సులతో పాటు ఖరీదైన వాచీలు హ్యాండ్ బ్యాగులు, కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా ఈమె ముంబైలోని ఫేమస్ పార్లర్ బయటకు వస్తూ కెమెరాకు చిక్కింది. స్టైలీష్ అండ్ కూల్ లుక్లో కనిపించి సందడి చేయడంతో అభిమానులు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ పై పడింది.
తమన్నా ఫంకీ ప్రింటెడ్ స్వెట్షర్ట్ను ధరించి బ్లాక్ జాగర్స్తో సందడి చేసినప్పటికీ అందరి దృష్టి మాత్రం ఆమె హ్యాండ్ బ్యాగ్ పై పడింది. తమన్నా క్లో టోట్ బ్యాగ్ ఉపయోగిస్తుంది.ఈ క్రమంలోనే ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంత ఉంటుందని అభిమానులు వెతకడం మొదలుపెట్టారు. అయితే దీని ధర తెలిసిన నేటిజన్ లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ హ్యాండ్ బ్యాగ్ ధర అక్షరాల రూ. 87,783 కావడంతో అందరూ ఈ ధర చూసి షాక్ అవ్వడమే కాకుండా మిల్కీ బ్యూటీ రేంజ్ అంటే ఈ మాత్రం ఉండాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.