Hero Venkatesh: హీరో దగ్గుబాటి వెంకటేష్ పూర్తి పేరు ఏంటో తెలుసా?

Hero Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో నటుడు దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు సంపాదించారు. ఇలా ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ ఇప్పటికి పలు చిత్రాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

ఇక వెంకటేష్ నేటితరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు అదేవిధంగా వరుణ్ తేజ్ ఎఫ్ 2, నాగచైతన్య వెంకీ మామ వంటి మల్టీస్టారర్ చిత్రాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేశారు. ఇదిలా ఉండగా వెంకటేష్ రానా కూడా త్వరలోనే ఓ మల్టీస్టారర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో వెంకటేష్ వ్యక్తిగత విషయానికొస్తే ఆయన దగ్గుబాటి రామానాయుడు గారి రెండవ కొడుకు అనే విషయం మనకు తెలిసిందే.

ఆయన హీరోగా ఇండస్ట్రీకి కేవలం వెంకటేష్ గా మాత్రమే మనకు పరిచయం అయ్యారు. కానీ వెంకటేష్ అసలు పేరు అది కాదు ఈయన పేరు దగ్గుబాటి వెంకటేశ్వర్లు. ఈయనకు తన తాతగారి పేరును పెట్టారు.అలాగే వారి ఇంటి దైవం వెంకటేశ్వరస్వామి కావడంతో స్వామి పేరు కలిసి వచ్చే విధంగా రామానాయుడు తన కొడుకుకి వెంకటేశ్వర్లు అని నామకరణం చేశారు. అయితే స్కూల్ కి వెళ్ళిన సమయంలో వెంకటేష్ పేరు వెంకటేశ్వర్లు కాస్త వెంకటేష్ గా మారిపోయింది. అయినప్పటికీ తనకి వెంకటేశ్వర్లు అనే పేరు అంటేనే ఇష్టమని వెంకీ ఎన్నో సందర్భాలలో తెలియచేశారు.