టాలీవుడ్ నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానం ఏమిటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈయన వయసు పైబడినప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎంతో చురుగ్గా నటిస్తూ ఎంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.అప్పట్లో వరుస సినిమాలతో ఎన్టీఆర్ ఎంతో బిజీగా ఉండేవారు.ఎంతగా అంటే ఒకే రోజు రెండు మూడు సినిమాలలో షూటింగులు చేస్తూ నిత్యం బిజీగా ఉండేవారు.ఇలా రోజు మొత్తం బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఏమాత్రం అలసిపోకుండా ఎంతో చురుగ్గా షూటింగులలో పాల్గొనే వారు. ఈ విధంగా ఎన్టీఆర్ ఇంత చురుగ్గా సినిమాలలో నటించడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
ఆయన తీసుకొని ఆహారమే అతనిని ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉంచిందని చెప్పాలి. మరి సీనియర్ ఎన్టీఆర్ ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు అనే విషయానికి వస్తే… ఎన్టీఆర్ ఎప్పుడు భోజనం చేయాలన్న తణుకు తప్పనిసరిగా ఇంటి నుంచి క్యారియర్ రావాల్సిందే. ఇలా ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని మాత్రమే ఆయన తినేవారు. ఇక ఆయనకు క్యారేజ్ వచ్చిందంటే ఆయన మాత్రమే కాకుండా సెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పుష్కలంగా భోజనం చేయవచ్చు. అంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ కి ఇంటినుంచి క్యారేజ్ వచ్చేది.
ఇక ఈయన పొద్దున్నే అల్పాహారంగా ఇడ్లీ దోస వంటి ఆహార పదార్థాలను తీసుకుంటారు. అయితే చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే తీసుకుంటారు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో తప్పనిసరిగా యాపిల్ జ్యూస్ ఉండాల్సిందే. మధ్యాహ్న భోజనంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా చూసుకోనే వారట. ఇక సాయంత్రం స్నాక్స్ గా ఏదైనా టిఫిన్ లేదా బజ్జీలు, అలాగే డ్రైఫ్రూట్స్ తినే వారు. ఇక వేసవి కాలంలో తప్పనిసరిగా ఈయన షూటింగ్ మధ్యలో అప్పుడప్పుడు రెండు లీటర్ల బాదం పాలు తీసుకుంటారట.ఇక మధ్యాహ్న భోజనం పూర్తి అయిన తర్వాత మామిడికాయ జ్యూస్ లో తప్పనిసరిగా గ్లూకోజ్ వేసుకొని తాగేవారు. ఈ విధంగా ఎన్టీఆర్ ఆహారంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆయన ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా షూటింగ్లలో పాల్గొనేవారు.