Director Sukumar: లెక్కల మాస్టర్ సుకుమార్ తన సినిమాల విషయంలో ఏమాత్రం లెక్క తప్పకుండా ఎంతో అద్భుతంగా సినిమాలను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో పుష్ప అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.పాన్ ఇండియా స్టైల్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా కోసం సుకుమార్ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం సుకుమార్ ఏకంగా పాతిక కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా ఈ మొత్తంలో రెమ్యునరేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు దర్శకులు మాత్రమే తీసుకుంటారు. అయితే సుకుమార్ పుష్ప సినిమా కోసం ఈ రేంజ్లో పారితోషకం తీసుకున్నారంటే అది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పవచ్చు.
అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం ఐదు భాషలలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో త్వరలోనే సుకుమార్ పుష్ప పార్ట్ 2 ప్రారంభించబోతున్నారనీ సమాచారం. ఇక ప్రస్తుతం సుకుమార్ తీసుకున్న ఈ జనరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.