Sri Reddy: కాంట్రవర్సి క్వీన్ శ్రీ రెడ్డి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..!

Sri Reddy: వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కాంట్రవర్సి క్వీన్ తరచూ ఏదో ఒక వివాదం వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. అటు సినిమాల గురించి , ఇటు రాజకీయాల గురించి తరచూ కామెంట్స్ చేస్తూ ఉంటుంది . ఒకానొక సమయంలో నిర్మాత కొడుకు పై లైంగిక దాడి ఆరోపణలు చేసి ‘ మా ‘ కార్యాలయం ముందు నగ్నంగా దీక్షలు చేపట్టింది . అప్పటి నుండి తరచూ ఏదో ఒక వివాదం వల్ల పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీ రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది.

ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ఆస్తుల విలువ గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెకు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని వినికిడి. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ శ్రీ రెడ్డి ఇలా మాట్లాడారు.. తనకు హైదరాబాదులో ఒక సొంత ఇల్లు ఒక ఆడి కార్ ఉన్నాయని, వాటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందనీ ఆవిడ చెప్పుకొచ్చారు . చెన్నైలో తన ఒక చిన్న అదే ఇంట్లో ఉంటున్నట్టు ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు . తన తల్లిదండ్రులు తనను దూరం పెట్టారని , ప్రస్తుతం తన తల్లిదండ్రులతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు . తల్లిదండ్రులు సపోర్ట్ లేని ఆడపిల్లలకు ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉండాలని పేర్కొంది.

అయితే ఎప్పుడు అందరినీ కించపరిచేలా మాట్లాడే శ్రీ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వటం లేదు. తాను చేస్తున్న కాంట్రవర్సిల కారణంగా టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో తన హాట్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ను పెంచుతుంది. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో తనకు బాగా అవకాశాలు వస్తున్నాయి. తాను కాంట్రవర్సీలు చేస్తున్నప్పటికీ తమిళులు తనకి అవకాశాలు ఇస్తున్నారని ఈ సందర్భంగా ఆవిడ తెలియజేశారు. త్వరలో హైదరాబాద్ వదిలి చెన్నైలోనే స్థిరపడాలని ఆమె అనుకుంటున్నట్టు తెలిపారు.