Big Boss season 6: బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొననున్న కంటెస్టెంట్ లు ఎవరో తెలుసా..?

Big Boss season 6: ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఇటీవల ముగిసింది. ఈ సీజన్ లో బిందుమాధవి టైటిల్ దక్కించుకుంది. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 కోసం సన్నాహాలు మొదలయ్యాయి. రెండు నెలల్లో ఈ బిగ్ బాస్ సీజన్ 6 టీవీలో ప్రసారం చేసేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ టీవీలో టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాటిస్పేట్ చేయటానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ నుండి ఐదు మంది కంటెస్టెంట్ లను సెలక్ట్ చేశారు.

ఈ క్రమంలో ఆర్జే చైతూకి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్జే చైతూపార్టిసిపేట్ చేయటానికి అంగీకరించకపోతే ఆ స్థానంలో ఆర్జే హేమంత్ ని తీసుకునే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అవకాశం కల్పించమని శివ నాగార్జున గారిని కోరాడు. దీంతో శివ కూడా ఈ సీజన్ లో పాల్గొనే అవకాశం ఉంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో ఫినకేకి చేరున్న వారిలో కచ్చితంగా ఐదు మంది సీజన్ 6 లో కనిపించే అవకాశం ఉంది. ఈ క్రమంలో శివతో పాటు అనిల్ అజయ్ మిత్రా కూడా బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కనుంది.

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కాకుండా బయటి నుండి
నెక్ట్స్ పార్టిసిపెంట్ గా యాంకర్ రోజా లేదా ప్రత్యూష ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంది. ర్యాంప్ సింగర్ గా పేరు తెచ్చుకున్న మామా సింగ్ – అలియాస్ కృష్ణ చైతన్య బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ గా బుల్లితెర నటుడు అమరదీప్ చౌదరి బిగ్ బాస్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో యాంకర్ భాను కూడా బిగ్బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయమైన కౌశిక్ కూడా ఈ సీజన్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక జబర్దస్త్ కామెడీ షో నుండి ఈసారి గెటప్ శ్రీను కి ఈ అవకాశం దక్కిందని సమాచారం. ఇక చివరగా యూట్యూబర్ నిఖిల్ వచ్చే అవకాశం ఉంది.