బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆవకాయ బిర్యాని సినిమా ద్వారా బిందు మాధవి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత పిల్ల జమిందార్ సినిమాలో నటించి గుర్తింపు పొందింది. తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ లో స్థిరపడిపోయింది. ఇటీవల ఓటిటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు కనిపించింది. ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో బిందూ ఆటకు అందరు ఫిదా అయిపోయారు. ప్రతిఫలంగా ఓట్లు వేసి ఆమెను గెలిపించారు. బిగ్ బాస్ చరిత్రలోనే టైటిల్ గెలుచుకున్న మొదటి లేడి కంటెస్టెంట్ గా బిందు మాధవి రికార్డు సృష్టించింది.
ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన బిందుమాధవికి తెలుగులో వరుసగాఆఫర్లు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అవడంతో బిందు మాధవి రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా గట్టిగా ఉన్నట్టు సమాచారం. బిగ్ బాస్ టైటిల్ దక్కించుకున్న అందుకు ఆమె రెమ్యూనరేషన్ తో పాటు 40 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా దక్కించుకుంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆమెకి తన సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. అనిల్ రావిపూడి తీయబోయే బాలకృష్ణ సినిమాలో బిందూ మాధవి కోసం ఒక పాత్ర రెడీ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం బిందూ మాధవి రెమ్యూనరేషన్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వరుస సినిమా అవకాశాలు రావడంతో బిందూ మాధవి తన పాపులారిటీకి తగ్గట్టు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది అని సమాచారం. గతంలో హీరోయిన్ గా ఒక్కో సినిమాకి పాతిక లక్షల వరకు పారితోషికం తీసుకునే ఈ అమ్మడు బిగ్ బాస్ ద్వారా పాపులర్ అవ్వటంతో ఏకంగా డబుల్ రెమ్యూనరేషన్ అంటే 50 లక్షల వరకు డిమాండ్ చేస్తోందనీ వార్తలు వినిపిస్తున్నాయి.