Star Celebrities: మందుకు బానిస అయిన స్టార్ట్స్ వీళ్ళే…!

Star Celebrities: అప్పట్లో దేవతలు తమ అందం పెంచుకునేందుకు సురాపానం అంటే ఆల్కహాల్ తీసుకునేవారు. అయితే అది చాలా మితంగా ఉండేది. కానీ నేటి తరం కథానాయకులు ఆ సురాపానాన్ని కొంచెం ఎక్కువ మోతాదులోనే తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే తాగుబోతుల్లాగా తయారవుతున్నారు. దాదాపు చాలా మంది హీరోయిన్లు తాగుబోతులుగా మారుతున్నారు. అందులో కొందరి పేరు మాత్రమే బయటికి రావడానికి కారణం. వారు పబ్లిక్ లో రచ్చ చేయడమే. వీళ్లు మొహాలు కడగకపోయినా, పళ్ళు తోముకోకపోయినా ఏ మాత్రం తగ్గకుండా ఉండలేరు. వాళ్లలో ముందు చెప్పుకోవాల్సింది మాత్రం శృతిహాసన్.

శృతి హాసన్ గురించి చెప్పాలంటే మామూలుగానే ఊర మాస్. సినిమాల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో ఇలాంటి మొహమాటం చూపించని శృతి అస్సలు మొహమాట పడదు. ఈమె పార్టీ కల్చర్ కు బాగా అలవాటు ఉండటం వలన షూటింగ్ లేకపోతే బెంగళూరు లేదా చెన్నై పబ్బుల్లో కనిపిస్తుంటుంది. సెలబ్రిటీ స్టేటస్ తో పాటు క్రేజ్ కూడా ఉండటంతో ఎంత తాగితే అంత పోస్తూనే ఉంటారు. తాను ఓ నేషనల్ సెలబ్రిటీకి కూతురిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి, చెన్నై రోడ్లమీద తాగుతూ చేసిన, హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇంకొక హీరోయిన్ ఊర్వశి. ఊర్వశి అనే కథానాయిక ప్రస్తుత సినిమా ఆడియన్స్ కి అంతగా తెలియక పోవచ్చు. 80ల కాలంలో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ఈవిడ ప్రస్తుతం సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ నెట్టుకొస్తోంది. పెద్దావిడ కదా అని ఈమెను తక్కువ అంచనా వేస్తే చాలా తప్పు. ఒక పబ్లిక్ పార్టీలో వీరలెవల్లో తాగేసి చేసిన రచ్చ గురించి చెన్నై వర్గాల్లో ఇప్పటికీ చెవులు కొరుక్కుంటారు. కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి టాప్ హీరోల పక్కన నటించిన ఈ పెద్దావిడ అంత పెద్ద తాగుబోతు అంటే ఎవరు నమ్మరు. కానీ ఇదే నిజం.

ఇకపోతే త్రిష హీరోయిన్ గా అడుగుపెట్టి పదేళ్ళు పూర్తి చేసుకున్న కొద్దిమంది కథానాయికల్లో త్రిష ఒకరు. తను నటించిన సినిమాల్లో కంటే బయట చూపించిన ఆటిట్యూడ్ తోనే క్రేజ్ ఎక్కువ. నిజం చెప్పాలంటే ఈమె భయంకరమైన తాగుబోతు. తాలీ హోటల్స్ లో తాగి రచ్చ చేయడం మాత్రమే కాదు.. తాగిన మత్తులో కారు నడుపుతూ పోలీసులతో గొడవ పడడం, అరెస్టు చేయడం వరకూ పరిస్థితి తెచ్చుకున్నప్పటికీ, ఆమెకున్న పలుకుబడిని ఉపయోగించుకొని చాలా తెలివిగా బయటపడింది. తాగిన మత్తులోనే ఎంగేజ్మెంట్ పెళ్ళిని కూడా క్యాన్సిల్ చేసుకుంది.

బబ్లీ బ్యూటీ హన్సిక గురించి చెప్పాలంటే పెద్దగా ఏమీ ఉండవు. మహా అయితే ఏ హీరోతో తిరుగుతుందనో, లేదా హోటల్ బిల్స్ మరీ ఎక్కువగా పే చేయిస్తుందని హన్సికపై అబాండాలు ఉన్నాయి తప్పితే హన్సికపై మీద పెద్ద రూమర్లు అయితే ఏమీ లేవు. నిజంగా అయితే భోగన్ అనే సినిమా షూటింగ్ లో భాగంగా ఆల్కహాల్ ను నిజంగానే తాగేసిందంట. బ్యూటిఫుల్ లేడీ సన్నివేశంలో జీవించడం వరకు పర్లేదు కానీ సెట్లో కూడా నానా హంగామా చేసిందట. ఆమెను తట్టుకోవడం హీరో జయం రవి వల్ల కూడా కాలేదట.