Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్ ఒకరు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే రాజకీయాలలోకి వచ్చి ప్రస్తుతం రాజకీయాల పరంగా కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్నారు.
ఇలా పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ విషయాలను పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ద్వారా వార్తలలో నిలుస్తూ వచ్చారు.. అయితే తన మొదటి భార్య నందిని గురించి చాలామందికి తెలియదు . పవన్ కళ్యాణ్ తన మొదటి పెళ్లి చాలా సింపుల్గా చేసుకున్నారు అయితే ఇలా చేసుకోవడానికి గల కారణాలను తాజాగా డైరెక్టర్ గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టారు.
ఈ సందర్భంగా గీతాకృష్ణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి చేసుకున్న అమ్మాయి నందిని మాకు బంధువు అని తెలిపారు. మా అక్కను పోలవరంకు ఇచ్చి పెళ్లి చేసాము అయితే నందిని వాళ్ళది కూడా అదే ఊరని తెలిపారు. ఆ ఊరిలో వాళ్ళవి చాలా పెద్ద కుటుంబాలు. నేను నందిని చిన్నప్పుడు చూశాను తనను అందరూ చిన్ని చిన్ని అంటూ పిలిచే వాళ్ళు.నాగార్జున సినిమా షూటింగ్ కి వెళ్లినప్పుడు వర్షం కారణంగా వాళ్ళ ఇంట్లో కూర్చునే వాళ్ళము. అలా ఆ అమ్మాయిని పెళ్లికి ముందే నేను చూశాను కానీ పెళ్లి జరిగిన విషయం మాత్రం నాకు తెలియదని తెలిపారు..
పవన్ కళ్యాణ్ పెళ్లిని చాలా ఘనంగా జరిపించాల్సి ఉండగా ఎవరికి తెలియకుండా చాలా సింపుల్ గా షిరిడీకి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చారని తెలిపారు. అయితే సింపుల్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అని, గ్రాండ్ గా పెళ్లి చేస్తామని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోవడంతోనే వారి పెళ్లి సింపుల్గా జరిగిందని గీతాకృష్ణ తెలిపారు. ఇక పెళ్లి తర్వాత ఒకసారి పోలవరం వెళ్ళినప్పుడు నందిని తండ్రి తన పెళ్లి ఆల్బమ్ చూపించారని గీతాకృష్ణ తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ తన మొదటి పెళ్లి జరిగిన తర్వాత కొద్ది రోజులకే విడాకులు తీసుకుని అనంతరం హీరోయిన్ రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఈమెకు కూడా విడాకులు ఇచ్చి రష్యన్ యువతి అన్నా లెజినోవాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.