బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతూ 24 గంటల పాటు ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇకపోతే ఈ కార్యక్రమం అప్పుడే 10 వారాలు పూర్తి చేసుకుని చివరి దశకు వచ్చింది. ఈ కార్యక్రమం చివరి దశకు రావడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లను ఎంటర్టైన్ చేయడం కోసం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు హౌస్ లోకి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా సిరి, మానస్, షణ్ముఖ్ జశ్వంత్, బిగ్ బాస్ విన్నర్ సన్నీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ కంటెస్టెంట్ లను, ప్రేక్షకులను సందడి చేయడానికి కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో ఆ తర్వాత సీజన్లో తప్పనిసరిగా
హౌస్ మేట్స్ ను ఆ సందడి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే గత సీజన్ కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. అయితే వీరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ ఒకరోజు పాట హౌస్ లో కంటెస్టెంట్ ఎంటర్టైన్ చేయడం కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మరి సన్నీ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం కోసం ఏకంగా నాలుగు లక్షలు రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ కావడంతో అందరికన్నా ఎక్కువగా సన్నీకి చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక మానస్, సిరి రెండున్నర లక్ష, షన్నూ మూడు లక్షలు, రవి మూడున్నర లక్షల పారితోషికం అందుకున్నారట.
