Jabardasth: జబర్దస్త్ గీత ఒక్కరోజు కాల్షీట్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Jabardasth:గత తొమ్మిది సంవత్సరాల నుంచి బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం మొదట్లో కేవలం మగవారు మాత్రమే చేసేవారు. వాళ్లే లేడీ గెటప్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు. అయితే రాను రాను జబర్దస్త్ కార్యక్రమంలోకి కూడా లేడీ కంటెస్టెంట్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారిలో వర్ష, పైమా, వంటి వారు ఉన్నారు.

ఇకపోతే తాజాగా పుష్ప స్కిట్ ద్వారా జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చారు కమెడియన్ గీత. రాయలసీమకు చెందిన ఈమె రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. కెరియర్ మొదట్లో బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తూ పాపులర్ అయిన ఈమె అనంతరం టిక్ టాక్ వీడియోల ద్వారా గుర్తింపు పొందారు. ఈ గుర్తింపుతోనే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చిన గీత ఏకంగా జబర్దస్త్ అవకాశాన్ని అందుకుంది.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్న ఈమె భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గీత ఒకరోజు కాల్షీట్ కోసం 50 నుంచి 75 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గీత తనకు సీరియల్స్ లో అవకాశం వచ్చిన నటిస్తానని వెల్లడించారు.