వామ్మో జబర్దస్త్ లో సినిమా ప్రమోట్ చేస్తే నిర్మాత ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇకపోతే ఈ మధ్య కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలలో ప్రేక్షకులు పాల్గొని పెద్ద ఎత్తున వారి సినిమాలను ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువెళుతున్నారు.ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ క్యాష్ కామెడీ స్టార్స్ వంటి కార్యక్రమాలలో సెలబ్రిటీలు సినిమా ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ కార్యక్రమానికి విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఇలా ఎంతో ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం ద్వారా ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే నిర్మాతలు మల్లెమాల వారికి దాదాపు 12 నుంచి 15 లక్షల రూపాయల వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందట.కేవలం ఒక గంట పాటు సినిమాని ప్రమోట్ చేయడం కోసం నిర్మాతలు మల్లెమాల వారికి భారీగానే ముట్ట చెబుతున్నారు.

నిర్మాతలు సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా మల్లెమాల వారికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు అంటేనే జబర్దస్త్ కార్యక్రమం ఏ రేంజ్ లో ఆదరణ సంపాదించుకుందో మనకు అర్థమవుతుంది. ఇకపోతే మల్లెమాల వారు నిర్వహిస్తున్న క్యాష్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సుమారు 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇలా మల్లెమాల వారు వాళ్లు సినిమా ప్రమోషన్ ద్వారా భారీగానే డబ్బు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.