వామ్మో… సుమ జయమ్మకు ఎంత నష్టం వచ్చిందో తెలుసా?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా స్టార్ మహిళ కొనసాగుతూ ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సుమ ప్రధాన పాత్రలో విజయ్ కలివారపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయతీ. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 6వ తేదీ విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది అని చెప్పాలి. ఈ సినిమాలో సుమ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ ఒకే రోజు ఎక్కువ సినిమాలు విడుదల కావడం వల్ల ఈ సినిమా కలెక్షన్ల పై తీవ్ర ప్రభావం చూపింది.

సుమ ప్రధాన పాత్రలో నటించడం వల్ల ఈ సినిమాకు ఓపెనింగ్స్ మంచిగా రాబట్టిన క్లోజింగ్ డే కలెక్షన్ లో భారీ నష్టాలను ఎదుర్కొని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.3.45 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. ఈ సినిమా విజయంకావాలంటే రూ.3.5 కోట్ల రూపాయలు రాబట్టాల్సివుంది. కానీ ఈ చిత్రం ఈ సినిమా కేవలం కోటి రూపాయల కలెక్షన్లను మాత్రమే రాబట్టింది. దీంతో ఈ సినిమాకు 2.45 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా సుమకు ఉన్న క్రేజ్ ఆధారంగా భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే సుమ జయమ్మ పంచాయతీ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో ఈమె ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని ఇవ్వడంతో సుమ కేవలం బుల్లితెర మహారాణిగా మాత్రమే సెట్ అవుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.అయితే సుమ జయమ్మ పంచాయతీ విడుదలైన రోజే ఎక్కువ సినిమాలు విడుదల కావడంతో థియేటర్ సమస్య కారణంగా ఈ సినిమాపై కలెక్షన్లపై ప్రభావం కూడా పడిందని మరికొందరు తెలియజేస్తున్నారు.