పవన్ కళ్యాణ్ మూడవ భార్యకి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి అనంతరం మూడో వివాహాన్ని విదేశీ యువతి అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన ఇద్దరు భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం ఈమెని పెళ్లి చేసుకొనే వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

ఈమె హైదరాబాద్ లో కాకుండా విదేశాల్లోనే నివసిస్తున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న ఈమెకు ఏమేరకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అనే విషయానికి వస్తే.. ఈమెకు 1800 కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈమెకు రష్యా సింగపూర్ వంటి దేశాలలో పెద్ద ఎత్తున విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న తర్వాత అన్నా లెజినోవా పూర్తిగా మీడియాకు దూరంగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ కి పరిచయం ఏర్పడింది. ఇక పరిచయంతోనే ప్రేమలో పడ్డ తను పవన్ కళ్యాణ్ ను 2013 సెప్టెంబర్ 30వ తేదీ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈమె విదేశాల్లోనే పిల్లల బాధ్యతలను చేసుకుంటూ ఉండగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నివసిస్తూ పలు సినిమాలలో బిజీగా ఉండటమే కాకుండా జనసేన పార్టీ స్థాపించి రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.