ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. రౌడీ హీరో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా తనలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే వారికి అవకాశాలు ఇస్తూ నిర్మాతగా కూడా మారిపోయారు. ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోగా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ఈ హీరో మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించారు. రౌడీ స్టార్ అనే దుస్తుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇది మాత్రమే కాకుండా ఎన్నో బ్రాండ్ లకు అంబాసిడర్ కూడా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ విధంగా కెరీయర్ లో ఎంతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి.
ఈ విధంగా సినిమాలు వ్యాపారాల ద్వారా విజయ్ దేవరకొండ నెలకు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ రౌడీ హీరో ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా భారీ మొత్తంలో సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. ఇక ఈయన నటించిన సినిమాల విషయానికి వస్తే లైగర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయనున్నారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చిత్రంలో కూడా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు.