తెలుగు సినీ ఇండస్ట్రీలో హాస్యకర సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి అందరికీ తెలిసిందే. ఈయన స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక ఈయన సినిమాలు ఎంత ఆసక్తిగా, సరదాగా ఉంటాయి. ఇక ఈయనే కాకుండా తన ఇద్దరి కొడుకులను ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయగా వారితో కూడా కొన్ని కామెడీ సినిమాలను చేయించాడు.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో అల్లరి నరేష్ కొనసాగుతూనే ఉండగా.. ఆర్యన్ రాజేష్ మాత్రం సినిమాలకు దూరమయ్యాడు. కెరీర్ మొదట్లో మంచి అవకాశాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్యన్ రాజేష్ సినిమాలకు దూరం అయిన తర్వాత కొంతకాలానికి తన తండ్రి స్నేహితుడు కూతురైన సుభాషినిని తన కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.
ఇక పెళ్లి కంటే ముందు ఆర్యన్ రాజేష్ కు సుభాషిని ఫోటోలు పంపించి పెళ్లి చేసుకోవాలి అని అన్నారట. కానీ దానికి ఒప్పుకోలేదట రాజేష్. ఆ తరువాత సుభాషినిని నేరుగా చూసి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడట. అలా 2011లో జనవరి 5న కుటుంబ సమక్షంలో పెళ్లి చూపులు జరుగగా.. ఆ తర్వాత వారం రోజులకే జనవరి 11 న ఈవీవీ సత్యనారాయణ మరణించారట.
ఇక ఆ సమయంలో ఆర్యన్ కుటుంబం కు సుభాషిని అండగా నిలిచిందట. ఇక ఆ తర్వాత 2012 ఫిబ్రవరి 12న వీరు వివాహం చేసుకోగా సంవత్సర కాలానికే వీరికి ఒక కుమారుడు పుట్టాగా.. తన తండ్రినే మళ్ళీ తన బాబు గా పుట్టాడు అని అనుకున్నారట ఆ కుటుంబ సభ్యులు. ఆర్యన్ ప్రస్తుతం పలు బిజినెస్లు చూసుకుంటూ ఉన్నట్లు తెలిసింది. అల్లరి నరేష్ కు కూడా పెళ్లి కాగా ఆయనకు పిల్లలున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఆర్యన్ మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడో లేదో చూడాలి.