నందమూరి నటసింహం బాలకృష్ణ వదులుకున్న బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏంటో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోలకు వచ్చే అవకాశాలను పలు కారణాల వల్ల రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటాయి. అలాగే మరి కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ హీరోలు వారికి వచ్చిన సినిమా అవకాశాలను వదులుకొని ఇతర హీరోలకు బ్లాక్ బాస్టర్ అందించారు.ఈ విధంగా బాలయ్య బాబు కూడా తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నారు. మరి బాలకృష్ణ వదులుకున్న బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

విక్టరీ వెంకటేష్ మీనా జంటగా నటించిన చంటి సినిమాలో ముందుగా నటించే అవకాశం బాలకృష్ణకు వచ్చింది.అయితే బాలకృష్ణకు ఈ కథ నచ్చక పోవడంతో ఆయన రిజెక్ట్ చేసి వెంకీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. నాగార్జున విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన జానకి రాముడు సినిమా ముందుగా బాలకృష్ణ వద్దకు వచ్చింది. అయితే పలు కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో నాగార్జున ఈ సినిమాలో నటించారు.

హీరో రాజశేఖర్ నటించిన సింహరాశి సినిమా కూడా బాలయ్య వదులుకున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.వెంకటేష్ ద్విపాత్రాభినయంలో నటించిన సూర్యవంశం సినిమా కథ ముందుగా బాలక్రిష్ణ వద్దకు వెళ్ళింది. అయితే ఈ సినిమా పెద్దన్నయ్య సినిమా తరహాలో పోలి ఉండటంతో ఈ సినిమాని బాలకృష్ణ రిజెక్ట్ చేశాడు. వెంకటేష్ నటించిన హిట్ ఖాతాలో వేసుకున్నారు. అలాగే జగపతి బాబు నటించిన శివరామరాజు చిత్రాన్ని కూడా బాలకృష్ణ వదులుకున్నారు. వెంకటేష్ ఘర్షణ, ఎన్టీఆర్ సింహాద్రి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి, రవితేజ క్రాక్ సినిమా అవకాశాలు ముందుగా బాలకృష్ణ దగ్గరికి వెళ్ళాయి.అయితే బాలకృష్ణ ఈ సినిమాలను రిలీజ్ చేయడంతో ఇతర హీరోలు ఈ సినిమాలలో నటించి హిట్ అందుకున్నారు.