Anushka Shetty: అనుష్క పోస్టర్ కారణంగా 40 యాక్సిడెంట్లు.. రంగంలోకి దిగిన పోలీసులు..చివరికి!

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుష్క శెట్టి తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసను నటించి మెప్పించింది. అయితే మొన్నటి వరకు వరుసగా సినిమాలతో అలరించిన అనుష్క ప్రస్తుతం కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది. బాహుబలి సినిమా తర్వాత సినిమాలో చేయడం పూర్తిగా తగ్గించేసింది. ప్రస్తుతం కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే అనుష్క నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. వాటిలో వేదం సినిమా కూడా ఒకటి. అనుష్క కెరియర్లో గుర్తిండిపోయే సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఇందులో అనుష్క వేశ్య పాత్రలో నటించి అద్భుతమైన నటనను కనబరిచింది. ముఖ్యంగా తన అంద చందాలతో యువతను బాగా ఆకట్టుకుంది. అయితే వేదం సినిమా రిలీజ్ అయ్యి నేటికీ సరిగ్గా 15 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆశ్చర్యపోయే సంఘటన అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది.

అదేంటంటే వేదం సినిమా నుంచి అనుష్క ధరించిన పసుపు రంగు చీర స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా ఉపయోగించారు. ఆ ఫోటోలో అనుష్క పసుపు రంగు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తూ మత్తెక్కించే చూపులతో యువతను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం విడుదల సమయంలో.
ప్రమోషన్స్ లో భాగాంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారు. దీంతో ఆ హోర్డింగ్ లో అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్స్ చేసారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అనుష్క హోర్డింగ్ వల్ల దాదాపు 40 యాక్సిడెంట్ లు అయ్యాయట. పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా ఆ హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను గుద్దేసేవారట. దీంతో రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరగడంతో పోలీసులు ఇది గమనించి GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట. అలా అనుష్క తన అందంతో ఎవర్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది ఆ సమయంలో. అలా ఈ సంఘటన కూడా అనుష్క కెరియర్ లో మరిచిపోలేనిదిగా నిలిచిపోయింది.