Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా ఎంతో మంచే సక్సెస్ అందుకున్న వారిలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన ప్రస్తుతం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. రాజమౌళి కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా పని చేసేవారు ఇలా శాంతినివాసం అనే సీరియల్ కు దర్శకుడుగా పని చేసిన ఈయన అనంతరం సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలను అందుకున్నారు. అలా ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు రాజమౌళి పరిచయమయ్యారు. ఇక ఈయన డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమానే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హిట్ కొట్టిన రాజమౌళి అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుని కెరియర్ పరంగా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందిన రాజమౌళి RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో కలిసి పాన్ వరల్డ్ స్థాయిలో ఒక అడ్వెంచరస్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక రాజమౌళి కూడా హీరోలకు ఏమాత్రం తగ్గకుండా కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలా 100 కోట్లు అందుకుంటున్న రాజమౌళి కెరియర్ మొదట్లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? ఈయన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత?అనే విషయానికి వస్తే… తాజాగా కుబేర సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళికి యాంకర్ సుమ ఇదే ప్రశ్న వేశారు. అయితే రాజమౌళి సమాధానం చెబుతూ.. తాను కెరియర్ మొదట్లో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసేవాడిని, ఇలా ఎడిటర్ గా పని చేసినందుకుగాను తనకు 50 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలిపారు. అదే తన మొదటి జీతం అని తెలిపారు. అయితే ఆ 50 రూపాయలతో ఏం చేశానో నాకు గుర్తులేదు అంటూ రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 50 రూపాయల నుంచి 100 కోట్ల తీసుకునే స్థాయికి రాజమౌళి చేరుకున్నారు.