Prakash Raj: వామ్మో.. ప్రకాష్ రాజ్ ఆస్తుల గురించి తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.. ఏకంగా అన్ని కోట్లా!

Prakash Raj: తెలుగు ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలలో ఎన్నో రకాల పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. మొదటి హీరోగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత విలన్ పాత్రలలో అద్భుతంగా నటించి అదరగొట్టారు. ఎక్కువ శాతం ఆయనకు విలన్ పాత్రలే మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సినిమాలలో హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటిస్తూ చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడుగా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు ప్రకాష్ రాజ్. అప్పుడప్పుడు తన కామెడీతో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా బెంగళూరులో పుట్టి పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. కళాక్షేత్ర అనే నాటక సంస్థలో చేరి రంగస్థల నాటకాల్లో నటించారు. అయితే ఆ సమయంలో ఆయన జీతం కేవలం 300 మాత్రమే అందుకున్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కోట్లలో పారితోషకం అందుకుంటున్నారు. డైరెక్టర్ బాల చందర్ తో ఏర్పడిన పరచయం ఆయనను సినీరంగం వైపు అడుగులు వేసేలా చేసింది. 1994లో డ్యూయెట్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా పేరుతోనే సొంతంగా డ్యూయెట్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగుసార్లు జాతీయ అవార్డ్ గెలుచుకున్నారు. కన్నడ, తెలుగు సినిమాలకు సైతం నేషనల్ అవార్స్ అందుకున్నారు.

నటుడిగానే కాకుండా హోస్ట్ గా కూడా రాణించారు. కెరీర్ తొలినాళ్లల్లో హీరోగా అలరించిన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత విలన్ పాత్రలతో రఫ్పాడించారని చెప్పాలి. అలాగే తండ్రిగా, తాతయ్యగా, మావయ్య పాత్రలు పోషించి మెప్పించారు. తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేసి అలరించారు. ప్రకాష్ రాజ్ 1994లో లలిత కుమారి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కానీ 5 ఏళ్ల వయసులోనే కుమారుడు మరణించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే భార్యతో మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. 2009లో మొదటి భార్యతో డివోర్స్ తీసుకున్న ప్రకాష్ రాజ్ ఆ తర్వాత 2010లో పోనీ వర్మను రెండవ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇకపోతే ఆయన ఆస్తిపాస్తుల విషయానికి వస్తే. ప్రకాష్ రాజ్ ఆస్తులు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 నుంచి 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట.అలాగే ప్రకాష్ రాజ్ కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన వద్ద రూ. 17 లక్షలు విలువ చేసే టయోటా ఇన్నోవా, 45 లక్షలు విలువ చేసే BMW 520D మెర్సిడెస్ బెంజ్ రూ.63 లక్షలు, ISUZU V, Bolero Maxi Truck, Audi Q3 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.