Vastu Tips: సాధారణంగా చాలామంది ఇంటికి ఎన్నో రకాల అలంకరణ వస్తువులు తెచ్చుకుంటారు.ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో శుభ ఫలితాలను కలిగిస్తాయని చెబుతుంటారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏనుగు బొమ్మలు ఉంటే ఎంతో అదృష్టమని వాస్తు శాస్త్రం చెబుతోంది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న, అలాగే ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నవారు ఇంటి లోపల ఏనుగు బొమ్మలను పెట్టుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
సాధారణంగా ఏనుగు లక్ష్మీదేవికి ఇరువైపులా ఉంటాయి. అదేవిధంగా వినాయకుడి ప్రతిరూపం కూడా ఏనుగు అనే విషయం మనకు తెలిసిందే. అలాగే ఇంద్రుని వాహనం ఐరావతం కనుక శాస్త్రం ప్రకారం ఏనుగు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది.ఈ క్రమంలోనే మన ఇంట్లో కూడా ఏనుగు విగ్రహాలు ఉండటం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు అయితే ఈ ఏనుగు విగ్రహాలు ఎల్లప్పుడూ తొండం పైకి ఎత్తినవి ఉండాలి. ఇలాంటి ఏనుగు విగ్రహాలు ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటికి లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అలాగే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి.
ఇక ఈ ఏనుగు విగ్రహాలను ఇంటి లోపల ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టడం ఎంతో మంచిది అలాగే తొండం కిందికిదించుకొని ఉన్నటువంటి ఏనుగు విగ్రహాలను ప్రధాన ద్వారం ఇరువైపులా పెట్టడం వల్ల ఇంట్లోకి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు. అదేవిధంగా మన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఏనుగు విగ్రహాలు ఇంటిలో ఉండడం శుభసూచకంగా పరిగణిస్తారు.