Black Spots: నల్ల మచ్చల వల్ల అందవిహీనంగా కనిపిస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే అందం మీ సొంతం..!

Black Spots: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ యవ్వనంగా, అందంగా కనిపించటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు అందంగా కనిపించటానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలాంటి వాటిని ఉపయోగించటం వల్ల అందంగా కనిపించటం అటుంచితే చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖం మీద నల్ల మచ్చలు తో ఇబ్బంది పడేవారు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

సాధారణంగా ఈ రోజుల్లో ఆహారంలో వాతావరణ కాలుష్యం లో బాగా మార్పులు రావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. వాతావరణ కాలుష్యం వల్ల చర్మ సమస్యలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ముఖం మీద నల్ల మచ్చలు ఉండటం వల్ల చాలా అందవిహీనంగా కనిపిస్తుంటారు.ముఖం మీద నల్ల మచ్చలు తో ఇబ్బంది పడేవారు ఈ టిప్స్ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఒక మీద నల్ల మచ్చలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక చిన్న బౌల్ లో ఒక టేబుల్స్పూన్ బ్రౌన్ షుగర్ కొద్దిగా నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని బాగా ముఖం మీద అ వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయటం వల్ల చర్మం మీద ఉన్న రంధ్రాలలో ఉన్న దుమ్ము ధూళి తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

టీ ట్రీ ఆయిల్ లో ఉన్న ఔషధ గుణాలు చర్మం మీద ఉన్న నల్ల మచ్చలను పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి.వారానికి రెండు మూడు సార్లు టీట్రీ ఆయిల్ కొంచెం దూదిలో వేసుకొని మచ్చలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల సమస్య తగ్గుతుంది. అలాగే కలబంద గుజ్జుని మొహానికి రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా అప్పుడప్పుడు చేయటం వల్ల చర్మం మీద నల్ల మచ్చలు తగ్గుతాయి.