Vastu Tips: దేవుడి గదిలో తరచూ బల్లులు కనిపిస్తున్నాయా… అయితే సంపదలు మీ వెంటే!

Vastu Tips: సాధారణంగా బల్లులు అంటే చాలామంది భయపడుతుంటారు.అలాగే మన ఇంట్లో బల్లులు కనిపించిన చాలామంది వాటిని ఇంట్లో లేకుండా బయటకు తరుముతూ ఉంటారు. నిజానికి ఇంట్లో బల్లులు ఉండటం శుభప్రదమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అసలు ఇంట్లో బల్లి ప్రతిరోజు కనిపించడం సంపదకు కారణమవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇకపోతే దేవుడి గదిలో తరుచూ బల్లి కనిపించడం వల్ల మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఆర్థికాభివృద్ధి ఉంటుందని చెబుతారు.

ఇక నూతన గృహ ప్రవేశం చేసే సమయంలో ఇంట్లో బల్లులు కనబడితే మన పూర్వీకులు ఆశీర్వాదం మనపై ఉంటుందని అర్థం. అయితే గృహ ప్రవేశం సమయంలో చనిపోయిన బల్లులు కనబడితే అది అశుభానికి సంకేతం. అదేవిధంగా కలలో కూడా కొన్నిసార్లు బల్లులు పోట్లాడుతున్నట్టు కనపడతాయి.ఇలా కనిపించడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చోటుచేసుకుంటాయని కుటుంబ సభ్యుల మధ్య కూడా కలహాలు తలెత్తుతాయని అర్థం.

ఇక దీపావళి పండుగ రోజు మన ఇంట్లో బల్లి కనపడితే సాక్షాత్తు లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది.ఇక కళలు మనం బల్లి ని తరుముతున్నట్లు కనపడితే మనకు త్వరలోనే ఏదో మంచి జరుగుతుందని శుభవార్తలు వింటారు అని అర్థం. అయితే బల్లులు ఎప్పుడైతే నేలపై పాకుతున్నట్టు కనపడతాయి అది ఆ శుభానికి సంకేతం అని అలా కనిపించడం వల్ల భూకంపాలు వచ్చే సూచనలను మనకు తెలియజేస్తుందని అర్థం.