Actor Harsha vardhan: సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే… వేరే ఇంకెవరికైనా అయితే దుమారం లేచిపోయేలా కామెంట్స్ పెడతారని, కానీ తనను తిట్టే వారు చాలా తక్కువ అని ప్రముఖ నటుడు హర్ష వర్ధన్ అన్నారు. లేదంటే వాళ్ళు పట్టించుకోకుండా కూడా ఉండొచ్చని, అదీ కాదు అంటే అమృతం సీరియల్ లో చేశా కాబట్టి ఆ గౌరవం ఐనా అయి ఉండొచ్చని ఆయన అన్నారు. లేకపోతే తాను మాట్లాడే దానిలో ఏదైనా సెన్స్ ఉందని ఫీల్ అవుతారో తెలియదు గానీ, తనను హర్ట్ చేయాలని గానీ, తనను ఇబ్బంది పెట్టాలని గానీ ఎవరూ అనుకోరని ఆయన తెలిపారు.
ఇకపోతే మనం సినిమా సమయంలో తనకు అన్నపూర్ణ ఆఫీస్ నుంచి 2 సందర్భాల్లో సర్ మీ చెక్ ఎప్పుడు తీసుకుంటారని అడిగారని హర్ష వర్ధన్ అన్నారు. అన్నపూర్ణ సంస్థ అలా చేస్తుంది అనేది అందరికీ తెలుసు అని, అంటే వెంటనే డబ్బులు ఇస్తారని ఆయన చెప్పారు. అసలు ఎప్పుడూ డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు కూడా తనను పిలిచి మరీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారని ఆయన అన్నారు.
మన కష్టం అవతలి వాళ్లకు తెలిస్తే ఎలాంటి గొడవలూ రావని ఆయన తెలిపారు. కాబట్టి తనకు రెమ్యునరేషన్ దగ్గర ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కొనలేదని హర్ష తెలిపారు. ఇకపోతే తనకు ఎంత రెమ్యునరేషన్ వచ్చినా లైఫ్ లో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తానని ఆయన చెప్పారు. రోజుకు ఎంత సంపాదించిన ఎక్కువ ఖర్చు పెట్టే ఇస్తానని హర్షవర్ధన్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేసారు.