విరాటపర్వం సినిమా పై రివ్యూ ఇచ్చిన డీజే టిల్లు.. అద్భుతమైన కళాఖండం అంటూ కామెంట్స్!

రానా దగ్గుబాటి నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం.నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఎట్టకేలకు ఈనెల 17వ తేదీ విడుదల చేయాలని చిత్రబృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్ టీజర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాపై అంచనాలు పెంచాయి.

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా రవన్న పాత్రలో నటించగా, సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించారు.సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో నవీన్ చంద్ర సీనియర్ నటి ప్రియమణి వంటి వాళ్లు కూడా కీలక పాత్రలో సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా పై డిజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పందిస్తూ సినిమా రివ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా విరాటపర్వం సినిమాపై తన రివ్యూ ప్రకటించారు.

నిన్న రాత్రి విరాటపర్వం సినిమా చూశాను. ఈ సినిమా చూసి ఎంతో మంత్రముగ్ధుడిని అయ్యాను. ఇందులో ఇదివరకు ఎప్పుడూ చూడని రానా, సాయి పల్లవిలను చూశాను. వీరి నటన అద్భుతంగా ఉంది. విరాటపర్వం సినిమా ఒక చక్కని కళాఖండం. ఈ సినిమా చూసి నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చిత్ర బృందానికి సిద్దు జొన్నలగడ్డ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.