Mahesh And NTR : తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ స్టార్ హీరోలు అయినటువంటి యంగ్ టైగర్ సూపర్ స్టార్ మహేష్ బాబులు వెండి తెరపై నటించడానికి ఇంకా సమయం ఉందనగా అంతకు ముందే బుల్లితెరపై స్క్రీన్ పంచుకునే అవకాశం కలిపించి అభిమానులకు మాత్రం సూపర్ ఫీస్ట్ ఇచ్చే పని చేసారు. ఆ షో నే జెమినీ టీవిలో ప్రసారం అయ్యే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’.
ఈ ఫ్రాంచైజ్ లో కొత్త సీజన్ గా ఈ స్టార్ట్ అయ్యిన ఈ షో ఎన్టీఆర్ మాయాజాలంతో గత సీజన్ల కంటే మెరుగ్గా నడిచింది. దీనితో ఈ షో కి మరింత హంగు కుదిర్చేలా బిగ్గెస్ట్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్లాన్ చేసిన ఆ ఎపిసోడ్ కి రికార్డు మార్క్ టీఆర్పీ వస్తుంది అనుకుంటే లాస్ట్ చేసి ఈ ఎపిసోడ్ కి అట్టర్ ప్లాప్ రేటింగ్ వచ్చింది.
ఖచ్చితంగా ముందు తెలుగు టీవీ టార్ప్ రికార్డులు బద్దలు కొడుతుంది అనుకున్న ఈ షో షాకిచ్చే విధంగా కేవలం అంటే కేవలం 4.90 రేటింగ్ ని మాత్రమే అందుకొని బుల్లితెరపై డిజాస్టర్ గా నిలిచింది. దీనితో ఎన్టీఆర్, మహేష్ అభిమానులకి ఎటూ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.