ఆధిపత్యం కోసం అన్నదమ్ములు..అక్కా చెల్లెళ్లు కొట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. ఒకే పార్టీలో ఘర్షణలు చెలరేగి హత్యలు చేసుకున్న ఉదంతాలు ఎన్నో. కేవలం అధిపత్యం కోసం జరిగే వార్ ఇది. ఈ పోరుకు పార్టీలే పురుడు పోస్తాయి. అహం మాత్రమే పనిచేస్తుంది. ఫ్యాక్షనిజం ఆధిప్యత పోరు నుంచి పుట్టినదే. సీమలో పార్టీలకన్నా ముందు ఆధిప్యతం చెలామణి చేస్తుంది. అక్కడ ఇలాంటి ఘర్షణలు సహజం. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది.
ఫలితంగా 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో కొంత మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరి ఈ వర్గ పోరుకు కారణం ఏంటి? ఒకే పార్టీలో విబేధాలు ఎందుకు తలెత్తాయి? అంటే వివరాల్లోఇక వెళ్లాల్సిందే. ఇటీవల ఎంపీటీసీ నామినేషన్ విషయంలో ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అది వివాదంగా మారింది. దీంతో కొన్ని రోజులుగా ఇరు వర్గాలు మాటలు విసుకున్నారుట. ఓ వర్గం వారు సోమవారం వాగ్వివాదానికి దిగారుట. సహనం కోల్పోయిన మరో గ్యాంగ్ రాళ్లు రువ్వారుట. దీంతో ప్రతి దాడి మొదలైందిట. రెండు గ్యాంగులు ఒకరిపై ఒకరు కలబడటంతో గొడవ మరింత పెద్దదైందిట.
దీంతో ఇరు వర్గాలు కర్రలతో..కత్తులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారుట. పోలీసుల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న నేపథ్యంలో వివాదానికి అసలు కారణాలు బయటకు వస్తున్నాయి. కొన్ని నెలలుగా ఇసుక రీచ్ లు, రేషన్ డీలర్ షిప్ ల విషయంలో రెండు వర్గాల మధ్యా బయటకు తెలియని గొడవలు జరుగుతున్నాయట. దీంతో నాయకులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేసారుట. అయితే ఎంపీటీసీ నామినేషన్ వేసే విషయంలో ఈ వివాదం తారా స్థాయికి చేరుకుందని అంటున్నారు. లోకల్ పార్టీ నాయకులు నామినేషన్ విషయంలో కొంత గేమ్ ఆడారని వినిపిస్తోంది.