Director Teja: కొడుకును హీరోగా పరిచయం చేయనున్న దర్శకుడు తేజ.. ఏ సినిమాతో అంటే..?

Director Teja: టాలీవుడ్ దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దర్శకుడు తేజ ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటిస్తున్న అహింస సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో అభిరామ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఎంతో మంది కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ త్వరలోనే తన కొడుకుని కూడా హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఫిబ్రవరి 22న తేజ బర్త్ డే సందర్భంగా అతనికి సంబంధించిన కొత్త సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

వాటిలో పీరియాడికల్ ఎపిక్ లవ్ స్టోరీ గా విక్రమాదిత్య సినిమాను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అతని బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. 18 వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆ సినిమాలో తేజ కొడుకు అమితవ్ లీడ్ రోల్ లో పోషిస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమాదిత్య అనే పీరియాడికల్ లవ్ స్టోరీ తో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.