Director Samudra: డైరెక్ట్ చేసిన సినిమాకు రాజశేఖర్, జీవిత వాళ్ల పేర్లు పెట్టుకున్నారు: డైరెక్టర్ సముద్ర

Director Samudra: రాజశేఖర్ దంపతులకు, తనకు మధ్య విభేదాలను గురించి డైరెక్టర్ సముద్ర స్పందించారు. వారు ఎవడైతే నాకేంటీ సినిమా వరకు ఫ్లాపుల్లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పటివరకు తనకు కొన్ని సినిమాలు చేయమని రాజశేఖర్ చెప్పారని, కానీ అవి తనకు నచ్చకపోవడం వల్లే తాను చేయలేదని సముద్ర అన్నారు. కానీ ఆయన మాత్రం తాను కావాలనే చేయట్లేదేమో, తనకు ఆయన సినిమాలు తీయడం ఇష్టం లేదేమో అని ఫీలయ్యారని సముద్ర చెప్పారు. అలా తనను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఆ తర్వాత ఎవడైతే నాకేంటీ సినిమా సబ్జెక్ట్ నచ్చి అ మూవీ చేస్తానని తాను ఒప్పుకున్నట్టు సముద్ర తెలిపారు. చేసిన తర్వాత సినిమా బాగా వచ్చిందని, కచ్చితంగా హిట్ కొట్టబోతుందని వారికి అర్థమయ్యి తనను తీసేసి, డైరెక్టర్‌గా వారి పేర్లు వేసుకున్నారని ఆయన చెప్పారు. అది ఒకరి ఆలోచన మాత్రమే కాదని, వాళ్లిద్దరూ కావాలనే ప్లాన్ చేసుకొని తనను స్పాట్‌లో ఇరిటేట్ చేయడం, డీ గ్రేడ్ మాట్లాడడం చేసేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా అవుతుంది కదా అని తాను ఎందుకొచ్చిన గొడవ అని భావించి, మీరు ఇంత డ్రామాలు ఎందుకు ఆడుతారు.. మీరు చేసుకోవాలనుకున్నారు సినిమా.. నా పేరు తీసి మీ పేరు వేసుకోవాలనుకుంటున్నారు. వేసుకోండి, నేను ఇప్పుడే వెళ్లిపోతాను. మీరు డైరెక్షన్ చేసుకొని, మీ పేరే వేసుకోండి. రేపట్నుంచి కూడా నేను రాను అని చెప్పి తాను వచ్చేసానని ఆయన చెప్పారు. అప్పటికీ సినిమా దాదాపు 80% పూర్తయిందని ఆయన తెలిపారు. ఫస్ట్ టైం తానకు ఆ సంఘటన ఎదురైందని, తాను కూడా ఫస్ట్ టైం అలా బిహేవ్ చేసిన సందర్భం కూడా అదేనని ఆయన చెప్పారు. ఆ తర్వాత మళ్లీ వాళ్లే రియలైజ్ అయ్యి, మీరే చేయండి, మీరు నా బ్రదర్ లాంటి వారు, ఫ్యామిలీ మెంబర్‌లో ఒకరు అని పిలిచి, మీరే చేయాలని అడిగారని ఆయన అన్నారు.