Radhe Shyam : వైరల్ : హాట్ టాపిక్ గా “రాధే శ్యామ్” పై దర్శకుడు అత్యంత ఆసక్తికర పోస్ట్.!

 Radhe Shyam : లేటెస్ట్ గా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధాకృష్ణ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే లతో తీసిన ఈ చిత్రం అనుకున్న స్థాయి రెస్పాన్స్ ని అయితే అందుకోలేదు కానీ క్లాస్ ఆడియెన్స్ ని మరియు ప్రేమికులని మూవీ లవర్స్ ని బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ భారీ సినిమాని ఒక ఎపిక్ లవ్ స్టోరీ టేల్ గా తీస్తున్నామని హీరోయిన్ పూజా నుంచి దర్శకుడు రాధా వరకు అందరు చెప్తూ వచ్చారు. అయితే అసలు ఈ సినిమాలో గ్రేట్ లవ్ స్టోరీ కి నిదర్శనంగా దేవుళ్లలో అతి గొప్ప ప్రేమికులుగా కొలిచే శ్రీ కృష్ణుడు సత్యభామ ల ప్రేమ కథని చెబుతారు.

ఆ రీతిలో రాధే శ్యామ్ ని తాను కూడా తన హీరో హీరోయిన్స్ ని చూపించానని ఇప్పుడు ఒక క్లారిటీ ని సాలిడ్ గా ఇచ్చాడని చెప్పాలి. తన సినిమాలోని క్లైమాక్స్ షూట్ లో ప్రభాస్ చాలా దెబ్బలతో హీరోయిన్ పూజా హెగ్డే దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంటాడు.

సరిగ్గా ఇలాంటిదే తన ప్రేమ ముందు తనని తాను తగ్గించుకొని ప్రేయసి కాళ్ళ ముందు ప్రేమను వ్యక్తం చేస్తున్న శ్రీకృష్ణుడుని ఫోటోతో రెండు ఫ్రేమ్స్ ని చూపించాడు. ఇది చూస్తే రాధా విజన్ ఏంటో అందరికీ అర్ధం అవుతుంది. అలాగే చాలా మందికి కూడా ఇప్పుడిప్పుడే ఈ సినిమాలో లోతు కూడా తెలుస్తుంది. దీనితో ఈ పోస్ట్ మాత్రం మంచి వైరల్ అవుతుంది.