టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, బిల్లా, బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. బాహుబలి సినిమాతో ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
కెజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన
కేజిఎఫ్, కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవటంతో సలార్ సినిమా మీద కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా బాహుబలి తర్వాత రెలీజరైన రెండూ సినిమాలు ప్లాప్ అవటంతో ప్రభాస్ అభిమానులకు నిరాశ చెందారు. కనీసం సలార్సినిమా అయిన హిట్ ఇస్తుందని ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రభాస్ కి కొన్ని కండిషన్స్ పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ప్రభాస్ బరువు విషయంలో మరింత స్ట్రిక్ట్ గా ఉన్నట్టు సమాచారం. బాహుబలి సినిమా కోసం బరువు పెరిగిన ప్రభాస్ అప్పటినుండి అలాగే బరువు మెయింటైన్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఆ మధ్యకాలంలో ప్రభాస్ మోకాలికి కూడా సర్జరీ జరగటం వల్ల మరింత బరువు పెరిగాడు. పైగా ప్రభాస్ వ్యాయామాల విషయంలో శ్రద్ధ వహించకపోవడం వల్ల సన్నబడలేక పోయాడు. దీంతో ప్రభాస్ ఫిజిక్ మీద కూడా దెబ్బపడే అవకాశం ఉంది. ప్రభాస్ బరువు తగ్గకపోతే భవిష్యత్తు సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. సలార్ సినిమా కోసం ప్రభాస్ బరువు తగ్గాలని డైరెక్టర్ కండిషన్ పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా స్టార్టింగ్ లో చేసిన లుక్ కోసం ప్రభాస్ కొంచెం బరువు తగ్గటం చాలా అవసరం.