సలార్ గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఇదే పేరు మారుమోగిపోతుంది. ప్రభాస్ కొత్త సినిమా సలార్ అనే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి సలార్ మూవీ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. కే జి ఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.
ఈ కాంబినేషన్ విషయంలో గత కొంత కాలం నుంచి వినిపిస్తోన్న రూమర్స్‌ను నిజం చేస్తూ..ప్రకటన రావడంతో అభిమానులు ఓ రేంజ్‌లో సంతోషపడుతున్నారు. అందులో భాగంగా సెన్సేషనల్ కాంబో ప్రశాంత్ నీల్ తో ప్రకటన రావడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. వీటికి తోడు తాజాగా విడుదలైన పోస్టర్ అండ్ టైటిల్ కూడా మాంచి థ్రిల్లింగ్ కు గురిచేస్తోంది. అయితే ఇదే సమయంలో కన్నడలో అంత మంది హీరోలు ఉన్నప్పుడు ఒక తెలుగు హీరోను ఈ సినిమా కోసం ఎందుకు తీసుకున్నారు అంటూ కన్నడ అభిమానులు కొందరు ప్రశాంత్ ను టార్గెట్ చేశారు.
దీనిపై డైరెక్టర్ ఓపెన్ అయ్యాడు. ఈ కథకు ప్రభాస్ తప్ప మరో హీరో తనకు కనిపించడం లేదని కుండబద్దలు కొట్టాడు. ప్రభాస్ వంటి హీరో కన్నడ లోనే కాదు, ఎక్కడా లేడని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. తన కథకు అమాయకమైన లుక్స్ ఉండే స్టార్ హీరో కావాలని, ప్రభాస్ లో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో ‘సలార్’ అనే పదానికి అర్ధం కూడా చెప్పాడు. సలార్ అంటే ఉర్దూ పదం. దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా నాయకుడు అంటారు. దానికి పర్ఫెక్ట్ అర్థం కావాలి అంటే కమాండర్-ఇన్-చీఫ్ అని. తన సినిమాకి సంబంధించి ‘సలార్’ అంటే కుడిభుజం లాంటి ఓ వ్యక్తి జనరల్ గా ఎలా ఎదిగాడనే విషయాన్ని చూపించనునట్లు తెలిపాడు దర్శకుడు ప్రశాంత్.