Jyothi Krishna: మూడుసార్లు సినిమాను చూసి ఇంకొక సినిమా చేస్తానని మాట ఇచ్చారు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

Jyothi Krishna: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. దాదాపు ఈ సినిమా విడుదల అవ్వడానికి ఐదేళ్ల సమయం పట్టింది. ఐదేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూనే ఉంది. అనేక కారణాలవల్ల వాయిదా పడుతూ ఇబ్బందులు పడింది ఈ సినిమా. ఎట్టకేలకు ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల కాబోతోంది అంటూ మూవీ మేకర్స్ ప్రకటించడంతో పవన్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే జూన్ 12 న థియేటర్లలోకి రావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.

సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇతర కారణాలవల్ల సినిమా వాయిదా పడిందని, సినిమాకు బయ్యర్లు దొరకట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు సంగతి పక్కనబెడితే మూవీని అధికారికంగా వాయిదా వేసినా సరే ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు మూవీ మేకర్స్. ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా మచిలీపట్నంలో ఈవెంట్ నిర్వహించారు.

మచిలీపట్నం బీచ్ ఒ‍డ్డున హరిహర వీరమల్లు సినిమా ఈవెంట్ శుక్రవారం సాయంత్రం జరిగింది. దీనికి హీరోయిన్ నిధి అగర్వాల్‌ తో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ కూడా హాజరయ్యారు. అయితే ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఒక్కసారి కాదు ఈ సినిమాని మూడు సార్లు చూశారు. గంటపాటు నన్ను మెచ్చుకున్నారు. మళ్లీ ఇంకో సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చారు. అసురన్ అనే పాటని అయితే ఏకంగా 500 సార్లు విన్నారు అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.