Allu Arjun: దిల్ రాజుకు బంపర్ ఆఫర్ ఇచ్చిన బన్నీ… గేమ్ చేంజర్ లోటును భర్తీ చేస్తారా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దిల్ రాజ్ కు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి. అల్లు అర్జున్ నటించిన మొదటి చిత్రం గంగోత్రి సినిమాకు దిల్ రాజు నిర్మాతగా మాటారు అనంతరం బన్నీ నటించిన ఆర్య, పరుగు, ఎవడు ,డీజే దువ్వాడ జగన్నాథం వంటి సినిమాలను చేశారు ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ ఐకాన్ అనే సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ద్వారా మరింత క్రేజ్ వసంతం చేసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే దిల్ రాజుతో ఈయన ఓ సినిమా చేయటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటీవల దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా కలిసి రావడం లేదని చెప్పాలి రాంచరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేసినప్పటికీ ఈ సినిమా ద్వారా దిల్ రాజు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇలా పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని దిల్ రాజు కల నెరవేరుకుండా పోయింది. అందుకే అల్లు అర్జున్ ఆ లోటును తీర్చబోతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈయన ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. మరి అది ఐకాన్ కథనా లేకపోతే కొత్త సినిమాల అనేది తెలియదు కానీ ఈయన మాత్రం దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఇటీవల సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ప్రభుత్వానికి, అల్లు ఫ్యామిలీ కి మధ్య వారధిగా నిల్చి, ఆ సమస్య ముదరకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడంలో కీలక పాత్ర పోషించారు అందుకే అల్లు అర్జున్ దిల్ రాజు పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకుంటూ ఆయనతో సినిమా చేసే తనకు ఒక మంచి హిట్ ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది మరి ఈ కాంబినేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.