రాజమౌళితో రామ్ చరణ్, ఎన్టీఆర్ విభేదిస్తున్నారా ?

Differences between NTR, Ram Charan, SS Rajamouli
Differences between NTR, Ram Charan, SS Rajamouli
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో సినిమా మీద ఆసక్తి, అంచనాలు విపరీతంగా ఉన్నాయి.  ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ పాన్ ఇండియా మూవీ కరోనా లాక్ డౌన్ మూలాన వాయిదాపడుతూ వస్తోంది.  ఈ ఏడాదిలో అయినా రిలీజ్ చేస్తారని ప్రేక్షకులు బోలెడు ఆశలతో ఉంటే ఇప్పుడు అది కూడ కిదిరేలా లేదు.  ఇంకో రెండు నెలల పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.  దీనికితోడు భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.  అందుకే ఈ సంవత్సరం సినిమా లేనట్టే. 
 
ఇక కొత్త విడుదల తేదీగా రెండు డేట్స్ వినిపిస్తున్నాయి.  వాటిలో ఒకటి 2022 సంక్రాంతి కాగా మరొకటి 2022 వేసవి సమయం.  వీటిలో సంక్రాంతికి సినిమాను వదలాలని హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆట్ భావిస్తున్నారట.  సంక్రాంతి సీజన్ అయితే అంత పెద్ద సినిమాకు బాగా వర్కవుట్ అవుతుందని ఎన్టీఆర్, చరణ్ అనుకుంటున్నారట.  కానీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ రాజమౌళి ఆలోచనలు వేరేలా ఉందట.  సంక్రాంతికి అయితే కొన్ని పెద్ద సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది.  అదే సమ్మర్ అయితే సోలో రిలీజ్ ఉంటుందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కావలసినంత టైమ్ కూడ దొరుకుతుందనేది జక్కన్న క్యాలుక్యులేషన్.  మరి హీరోలు, దర్శకుడి మధ్యలో తలెత్తిన ఈ విబేధం చివరికి ఏ రిలీజ్ డేట్ వద్దకు వచ్చి ఆగుతుందో చూడాలి.