విజయ్ దేవరకొండ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని తెలుసా?

సినిమా ఇండస్ట్రీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన ఆ తర్వాత స్టార్స్ గా మారిన వాళ్ళు చాలా ఉన్నారు. మహేష్ బాబు, రాశి, తరుణ్ లాంటి వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్స్ గా ఆ తర్వాత కూడా సక్సెస్ అయ్యారు.

కానీ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్స్ గా చేసారని చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ ‘భక్త మార్కండేయ’ అనే ఒక సీరియల్ లో నటించారు. అలాగే అల్లు అర్జున్ చిరంజీవి నటించిన ‘విజేత’, కమల్ హాసన్ నటించిన ‘స్వాతిముత్యం’ సినిమాల్లో నటించారు. కళ్యాణ్ రామ్ తన బాబాయ్ సినిమా ‘బాల గోపాలుడు’ లో నటించారు.

వీళ్ళ లాగానే విజయ్ దేవరకొండ కూడా చిన్నప్పుడు నటించాడని చాలా మందికి తెలియదు. అయితే విజయ్ సినిమాల్లో కాదు కానీ ఒక టీవీ సీరియల్ లో నటించారు. విజయ్ దేవరకొండ పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివారు.అయితే ఇక్కడ చదువుతున్న సమయంలో సత్య సాయిబాబా జీవిత చరిత్ర గురించి ఒక తెలుగు సీరియల్ నిర్మించారు.

ఈ సీరియల్ లో తాను నటించినట్లు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆ వీడియోని షేర్ చేస్తూ తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినట్లు తెలిపారు.