సీఆర్ డీఏతో పాటు, వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ అసెంబ్లీలో రెండుసార్లు ఆమెదించి…పెద్దల సభ అయిన శాసన మండలికి పంపించిన నేపథ్యంలో అక్కడ మరోసారి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఇదంతా జగన్ వ్యూహాత్మకంగా వ్యవరించి బిల్లును రెండవసారి మండలికి పంపించడం జరిగింది. ఈ రెండు బిల్లులను మండలి తిరసర్కరించినా ఆమోదించినట్లుగానే ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. చట్ట ప్రకారమే ఇదంతా సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించినందుకు మండలి నిర్ణయంతో ఈ రెండు బిల్లులపై ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలుస్తోంది.
అయితే నిర్ణీత సమయం పూర్తయిన తర్వాత ఈప్రక్రియ మొదలవుతుంది. అంటే అసెంబ్లీ ముగిసిన నెల రోజుల తర్వాత గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత బిల్లులు చట్ట రూపం దాల్చుతుంది. దీంతో రాజధాని తరలింపు ప్రక్రియకు ఆటంకాలు దాదాపుగా తొలగిపోయినట్లే అవుతుంది. అయితే ఇటీవలే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ ని కలిసిన సంగతి తెలిసిందే. జగన్ పాలన ఎండగడుతూ చంద్రబాబు స్వయంగా కలిసి ఓ లేఖ అందిచారని ప్రచారంలోకి వచ్చింది. అయితే చంద్రబాబు అప్పటికప్పుడు గవర్నర్ కలవడం వెనుక అసలు కారణం రాజధాని తరలింపు అంశమే ప్రధాన ఎజెండా అయి ఉంటుందని తాజాగా వెలుగులోకి వస్తోంది.
రాష్ర్టంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రాజధాని తరలింపు బిల్లుకు గవర్నర్ సంతకం చేస్తే చట్ట రూపం దాల్చుతుంది. ఆ తర్వాత చంద్రబాబు చేయడానికి ఏమీ ఉండదు. అందుకే హుటాహుటిన గవర్నర్ ని కలిసి ఈ విషయం వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తాత్కాలికంగా మూడు రాజధానుల బిల్లుపై సంతకం ఆపగలిగితే ప్రస్తుతానికి గట్టెక్కినట్లే…తర్వాత విషయాన్ని నెమ్మదిగా మళ్లీ మూవ్ చేయోచ్చు అనే ఆలోచన అయి ఉండొచ్చని వినిపిస్తోంది. ప్రస్తుతం అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఆందోళనలు అయితే ఎక్కడా లేవు. జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా తరలింపు విషయాన్ని లైట్ తీసుకున్నాయి.