Balakrishana: బాలయ్య ఆ ఉంగరం వల్లే అఖండ రూ.వంద కోట్లు కలెక్ట్ చేసిందా?

Balakrishana: సాధారణంగా ప్రతి ఒక్కరికి నమ్మకాలు ఉంటాయి. కొందరు కొన్ని రకాల ఆభరణాలను ధరించడం వల్ల వారికి బాగా కలిసి వస్తుందని భావిస్తుంటారు. అలాగే మరికొందరు వారి జాతకం రీత్యా కొన్ని రకాల ఉంగరాలను ప్రత్యేకంగా తయారు చేయించి నిత్యం ధరించి ఉంటారు. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి ఆభరణాలు వారి దగ్గర ఉండటం వల్ల వారు చేసే ప్రతి ఒక్క పని విజయవంతమవుతుందని వారికి అదృష్టం కలిసి వస్తుందని భావిస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి సెంటిమెంట్స్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి దర్శక నిర్మాతలు హీరోహీరోయిన్లకి ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన చేతి వేళ్ళకు ఎప్పుడు పెద్ద ఉంగరాలు ఉంటాయి. అయితే ఈ ఉంగరాలను సాధారణ ఉంగరాలు కాకుండా బాలయ్య ఎంతో నమ్మకంతో తనకు అదృష్టాన్ని తెచ్చే ఉంగరాలుగా భావిస్తారని ఒక సందర్భంలో వెల్లడించారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుండి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం లేకుండా సతమతమవుతున్న బాలకృష్ణకి బోయపాటి శీను అఖండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకోవడానికి గల కారణం బాలయ్య చేతికి ఉన్న ఉంగరాలే అని పలువురు భావిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో సినిమాలలో తన సెంటిమెంట్ వర్క్ ఔట్ అవ్వడం ఈ సినిమా కోసం బాలకృష్ణ అదే సెంటిమెంట్ తో చేతికి ఉంగరాలు పెట్టుకున్నారని ఈ ఉంగరాల కారణంగానే బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని కోట్లలో వసూలు రాబడుతుందని తెలుస్తోంది.