ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసిన ధోని.. కూతురు, వైఫ్‌ని కూడా వ‌ద‌ల‌ని ఎంఎస్‌కే..వీడియో వైర‌ల్

మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సాధార‌ణ ఫ్యామిలీ నుండి వ‌చ్చిన ధోని అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఎన్నో రికార్డుల‌ని త‌న పేరిట న‌మోదు చేసుకున్నాడు. ధోని బ్యాట్ ప‌ట్టి గ్రౌండ్‌లో దిగాడంటే స్టేడియం హోరెత్తిపోవ‌డం, బౌల‌ర్ల గుండెల్లో ద‌డ పుట్ట‌డం ఖాయం. భార‌త్‌కు రెండు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు అందించిన ధోని, ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున ఆడి దానికి ఎన్నో సార్లు టైటిల్ అందేలా కృషి చేశాడు. . 39 ఏళ్ల ధోని 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. రీసెంట్‌గా ఆయ‌న అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి అంద‌రికి షాకిచ్చాడు.

గ్రౌండ్‌లోను ఇటు బ‌య‌ట కూడా ధోని చాలా కూల్‌గా ఉంటారు. పార్టీలకు వెళ్లిన పెద్ద‌గా సంద‌డేమి చేయ‌రు. కాని తాజాగా త‌న ఫ్యామిలీతో క‌లిసి ఓ పార్టీకి వెళ్ల‌గా,ఆ పార్టీలో కూతురు జీవా, స‌తీమ‌ణి సాక్షితో క‌లిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఆ త‌ర్వాత త‌న ఫ్రెండ్స్‌తోను స్టెప్పులేశాడు. ఎంతో జోష్‌తో ధోని వేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను చెన్నై సూప‌ర్ కింగ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. “ఇది చూసేటప్పుడు మనం నవ్వకుండా ఉండగలమా? ఖచ్చితంగా కాదు” అని క్యాప్షన్‌ జతచేసింది. ఈ వీడియో ధోని అభిమానులు, నెటిజన్లను ఆకట్టకుంటోంది.

సాక్షితో పెళ్లి కాక‌ముందు ధోని కొద్ది రోజుల పాటు దీపికా ప‌దుకొణేతో రిలేష‌న్‌లో ఉన్నాడు. మ‌ధ్య‌లో ఏదో తేడా రావ‌డంతో ఆమెకు బ్రేక‌ప్ చెప్పి సాక్షిని వివాహ‌మాడాడు. ఈ జంట వైవాహిక జీవితానికి గుర్తుగా జీవా జ‌న్మించ‌గా, ఆ చిన్నారితో ఎంతో స‌ర‌దాగా గ‌డుపుతుంటాడు ధోని. ఇటీవ‌ల త‌న ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్ వెళ్లిన ధోని అక్క‌డ సాక్షి బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ఘ‌నంగా నిర్వ‌హించాడు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్, స‌ల్మాన్ సోద‌రి అర్పిత‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.